Chhava : ‘ఛావా’కు చిక్కులు .. బ్యాన్ చేయాలంటూ డిమాండ్స్

Chhava : ‘ఛావా’కు చిక్కులు .. బ్యాన్ చేయాలంటూ డిమాండ్స్
X

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందించిన ‘ఛావా’కు చిక్కులు ఎదురవుతున్నాయి. విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమాను ముందుగా చరిత్రకారులకు చూపించాలని మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సమంత్ డిమాండ్ చేశారు. వారు సరే అన్నాకే విడుదల చేయాలన్నారు. లేదంటే నిషేధం తప్పదని హెచ్చరించారు. శంభాజీ రాజే డాన్స్ సీన్‌పైనా అభ్యంతరం చెప్పారు. ఆ సీన్ తొలగించాలని, ఆయన గౌరవానికి భంగం కలిగితే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు.

ఛావా’లో విక్కీ కౌశల్, రష్మిక మందన్న లెజిమ్ డాన్స్ సీన్‌ను తొలగించేందుకు సినిమా యూనిట్ సిద్ధమైంది. మహారాష్ట్ర మంత్రులు, చరిత్రకారుల అభ్యంతరాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని డైరెక్టర్ లక్ష్మణ్ ఉఠేకర్ అన్నారు. అంతకు ముందే ఆయన MNS అధినేత రాజ్‌ఠాక్రేను కలిశారు. ఛత్రపతీ శివాజీ మహారాజ్‌పై వచ్చిన ఛావా పుస్తకాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఆయన ఘనతను ప్రపంచానికి తెలియజేయడమే తమ ఉద్దేశమని చెప్పారు.

Tags

Next Story