Chiranjeevi : మోహన్ బాబును ఉద్దేశించే చిరంజీవి ఆ వ్యాఖ్యలు చేశారా..?

Chiranjeevi : మోహన్ బాబును ఉద్దేశించే చిరంజీవి ఆ వ్యాఖ్యలు చేశారా..?
X

అక్కినేని నాగేశ్వర్ రావు శతజయంతి సందర్భంగా ఆయన కుటుంబం అందించిన జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు రచ్చ గెలిచాననీ.. ఏఎన్‌ఆర్‌ అవార్డు అందుకోవడంతో ఇంట గెలిచా అంటూ తన మనసులో భావన గర్వంగా బయటపెట్టారు చిరంజీవి. అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఏఎన్ఆర్ అవార్డును తన మిత్రుడు నాగార్జున ఇచ్చిన రోజున... ఇప్పుడు తనకు ఇంట గెలిచానని అనిపిస్తోందన్నారు. తాను ఇంటా గెలిచాను... రచ్చా గెలిచానని చిరంజీవి చెప్పారు. తనకు అవార్డులు ఇవ్వడం ఇండస్ట్రీలో కొందరికి నచ్చదని చిరంజీవి అన్నారు. గతంలో టాలీవుడ్ అవార్డుల వేడుకలో సీనియర్ నటుడు మోహన్ బాబు.. చిరంజీవికి అడ్డుతగిలి రచ్చ చేసిన సంగతి తెలిసిందే. పరోక్షంగా మోహన్ బాబును ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పుకుంటున్నారు. దీంతో.. ఇండస్ట్రీలో ఇది టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.

Tags

Next Story