Chiranjeevi : గద్దర్ అవార్డ్స్ విషయంలో మౌనంపై రేవంత్ ఆగ్రహం.. చిరంజీవి స్పందన

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచించిన ప్రజాకవి గద్దర్ అవార్డులపై ఇండస్ట్రీ స్పందించి ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఆయన కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడిన మాటలపై చిరంజీవి స్పందించి ట్వీట్ చేశారు.
2024 డిసెంబర్ 9 నుంచి గద్దర్ అవార్డ్స్ ఇస్తామని ప్రభుత్వం చెప్పినా ఇండస్ట్రీ ప్రముఖులు ఎవరూ స్పందించలేదని సినారే సంస్మరణ సభలో రేవంత్ రెడ్డి అన్నారు. అవార్డులకు సంబంధించి సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన లేదంటూ రేవంత్ రెడ్డి కీలక మైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ మీద గుర్రుగా ఉన్నారంటూ వార్తలు షేర్ అవుతున్నాయి.
దీంతో తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్నగా భావిస్తున్న మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని, సినిమా అవార్డు లను పునరుద్ధరిస్తూ సినీ పరిశ్రమలోని ప్రతి భావంతులకు, ప్రజా కళా కారుడు గద్దర్ పేరు మీదుగా ప్రతియేటా 'గద్దర్ అవార్డ్స్' తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతి పాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకు వెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com