Chiranjeevi : గోవాలో చిరు బర్త్ డే సెలబ్రేషన్స్.. రామ్‌చరణ్ ఎమోషన్ వీడియో

Chiranjeevi : గోవాలో చిరు బర్త్ డే సెలబ్రేషన్స్.. రామ్‌చరణ్ ఎమోషన్ వీడియో
X

మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి తన కుటుంబంతో కలిసి గోవాలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా రామ్ చరణ్ ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేసి, నెటిజన్ల మనసు గెలుచుకున్నారు.

రామ్ చరణ్ షేర్ చేసిన ఈ వీడియోలో, ఆయన తన తండ్రి చిరంజీవికి కేక్ తినిపించడం, ఆ తర్వాత చిరు పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకోవడం కనిపించింది. ఈ దృశ్యం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం తండ్రీకొడుకులిద్దరూ ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. చిరంజీవి కూడా తన కుమారుడిపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ చెర్రీకు కేక్ తినిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన మెగా అభిమానులు పెద్దఎత్తున షేర్ చేస్తున్నారు

Tags

Next Story