Chitrangda Singh : చిత్రాంగద కవ్వింపులు..ఫోటోలు వైరల్!

లేత వయసులో తరగని అందచందాలతో కుర్రకారు హృదయాన్ని దోచేస్తోన్న నటి చిత్రాంగద సింగ్. తొలుత మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ.. 'హజారోన్ ఖ్వెషీన్ ఐసీ' మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమా లోనే తన నటనకు గాను ఉత్తమ మహిళా అరంగేట్రం అవార్డును అందుకుంది. అనంతరం ఈ అమ్మడు ఖేల్ ఖేల్ మేన్ లో చిన్న పాత్రలో కనిపించింది. ఇటీవల 'ఖాకీ: ది బెంగాల్ చాప్టర్'లో తన నటనతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం హౌస్ఫుల్ 5, రాత్ అకేలి హై 2లో నవాజుద్దీన్ సిద్ధిఖీతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంటోంది. ఇలా వరుస సినిమా ఆఫర్స్ జోరులో ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ అంతే ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా ఇన్స్టా వేదికగా తన ఫొటో షూట్ పిక్స్ షేర్ చేసింది. ఇందులో ఈ ముద్దుగుమ్మ వయ్యారాలన్నీ ఒలకబోస్తూ రెచ్చిపోయింది. బంగారు బ్లౌజు వంగ పువ్వు రంగు చీరలో.. కవ్వింపు చూపులతో అదరగొట్టింది. ఈ భామ షేర్ చేసిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట గుబులు రేపుతోంది. చిత్రాంగదలో మునుపటి కంటే గ్లో పెరిగిందంటూ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com