Actress : స్టీరింగ్ పట్టిన చిట్టి.. ఫొటోలు వైరల్

జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా బస్సు స్టీరింగ్ పట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. పెట్టిన ఈ ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో అభిమానాన్ని చాటుతున్నారు. రావణాసుర, లైక్, షేర్, అండ్ సబ్ స్కైబ్ సినిమాల్లో తన నటనా వైవిధ్యాన్ని చాటిందీ అమ్మడు. 2023 లో అల్లరి నరేశ్ హీరోగా నటించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాలోనూ మెరిసిందీ భామ. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, జామీ లివర్, హర్ష చెముడు, హరి తేజ నటించారు. తన నటనతో పాటు, ఫరియా తన ఫ్యాషన్ సెన్స్ కు కూడా ప్రశంసలు అందుకుంటోంది. ఆలీవ్ గ్రీన్ డ్రెస్ ధరించడంతో బోల్డ్ రింగులు, మ్యాచింగ్ నెక్లెస్తో మెరిసిపోతూ హొయలు పోయిందీ భామ. డ్రైవర్ సీట్లో కూర్చొని స్టీరింగ్ పట్టడం అన్నింటికన్నా హైలైట్ గా నిలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com