Citadel Honey Bunny Series : 170 దేశాల్లో టాప్ 10లో సిటాడెల్

వరుణ్ ధావన్, సమంత జంటగా నటించిన వెబ్ సిరీస్ 'సిటడెల్ : హనీ బన్నీ'.అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన సిరీస్ వ్యూస్ పరంగా రికార్డులు సృష్టించింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన 'సిటడెల్ : హనీ బన్నీ'లో 80-90ల కాలంలో సమాజంలో మహిళల పరిస్థితి ఏంటనేది చూపించారు. హనీ పాత్రలో సమంత నటించి మెప్పించారు. తన కుమార్తె నదియాను రక్షించుకొనే తల్లి పాత్రలో ఆమె కన్పించారు. ఇప్పుడీ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులను ఆక ర్షించింది. గ్లోబల్ స్థాయిలో ఎక్కువమంది చూసిన నాన్ ఇంగ్లిష్ సిరీస్ల లిస్ట్లో టాప్ 10లో స్థానం సొంతం చేసుకుంది. మొత్తం 170 దేశాల్లో ఈ సిరీస్ టాప్ 10లో ఉండడం విశేషం. 'సిటాడెల్: హనీ బన్ని' ఈ వెబ్ సిరీస్ పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా, జాన్వీకపూర్, అలియా భట్తో పలువురు నటీనటులు ఈ ట్రై లర్పై సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు. జాతీయంగా, అంతర్జా తీయంగా ఆకట్టుకున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com