Samantha : సిటాడెల్" తుఫాన్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, వరుణ్ ధావన్ జంటగా వచ్చిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేక్షకుల నుండి కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతే కాకుండా సమంత అభిమానులను ఫిదా చేసింది. ఈ క్రమంలో ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్ భారీ అంచనాల నడుమ మధ్య విడుదలై ఓ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. నవంబర్ 7 నుంచి అమెజాన్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతూ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది చూసిన సిరీస్‌గా నంబర్ 1 ప్లేస్‌లో నిలిచింది.తాజాగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా సిటాడెల్ తుఫాను ఏర్పడేలా చేసింది. దీనికి వస్తోన్న ఆదరణ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది’’ అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన సమంత తన ఇన్‌స్టాలో థాంక్స్ చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com