Prabhas vs Rajamouli : ప్రభాస్ వర్సెస్ రాజమౌళి.. బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్?

Prabhas vs Rajamouli : కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీ పైన బాగానే పడింది. కరోనా మహమ్మారికి చాలా సినిమాలు రిలీజ్‌కి దగ్గరలో ఉండి వాయిదా పడ్డాయి. మరికొన్ని సినిమా షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, అఖండ, పుష్ప సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి.
ఆ తర్వాత రిలీజ్ కావాల్సిన RRR, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా మూవీలు మరోసారి వాయిదా పడ్డాయి. అయితే మార్చి మూడో వారానికి కేసులు అదుపులోకి వస్తాయని, అప్పుడు సినిమాలను థియేటర్స్ లలో రిలీజ్ చేయాలని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్ని కుదిరితే మార్చి 18న రాజమౌళి RRR, ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కరోనా, ఒమిక్రాన్ కేసులు అదుపులోకి వస్తే ఈ ఏడాది మార్చి 18న లేదా ఏప్రిల్ 28న RRR సినిమాని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అదే టైంలోనే రాధేశ్యామ్ కూడా పోటీకి దిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ వర్సెస్ రాజమౌళి ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇక ఈ చిత్రాల తరవాత మహేష్ సర్కారు వారి పాట, మెగాస్టార్ ఆచార్య రిలీజ్ కానున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com