AP CM Chandrababu : మెగాస్టార్‌కు సీఎం చంద్రబాబు విషెస్

AP CM Chandrababu : మెగాస్టార్‌కు సీఎం చంద్రబాబు విషెస్
X

మెగాస్టార్ చిరంజీవి 70వ బర్త్ డే చేసుకుంటున్నారు. ఆయన ఫాన్స్ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మెగాస్టార్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఎక్స్ వేదికగా మెగాస్టార్ ను విష్ చేశారు. ‘‘మెగాస్టార్ చిరంజీవికి 70వ జన్మదిన శుభాకాంక్షలు. సినిమా, ప్రజా జీవనం, సామాజిక సేవలో మీ అద్భుతమైన ప్రయాణం లక్షలాది మందిని స్ఫూర్తిపరిచింది. మీ ఔదార్యం, అంకితభావంతో మరిన్ని జీవితాలను స్పర్శించాలని కోరుకుంటున్నా. మీకు ఆరోగ్యం, ఆనందం మరెన్నో గుర్తుండిపోయే సంవత్సరాలు ఉండాలని ఆశిస్తున్నా’’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Tags

Next Story