Color Photo Director : కలర్ ఫొటో డైరెక్టర్ పెళ్లి

Color Photo Director  : కలర్ ఫొటో డైరెక్టర్ పెళ్లి
X

కలర్ ఫొటో సినిమాతో దర్శకుడిగా పరిచయమై జాతీయ పురస్కారం అందుకు న్న ఆర్టిస్ట్ సందీప్ రాజ్. రైటర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ గా అదరగొడు తున్న సందీప్ రాజ్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన సినిమాలో పని చేసిన సినిమాలోనే హీరోయిన్ గా నటించిన ఒక బ్యూటీని ఆయన త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నాడు. ఇటీవలే వైజాగ్ లో ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. కలర్ ఫొటో తర్వాత తాను స్క్రిప్ట్ అందించిన మూవీల్లో ఒకటి హెడ్స్ అండ్ లేల్స్' ఇందులో హీరోయిన్ గా నటించిన తెలుగమ్మాయి చాందినీ రావుకి సందీప్ తాళి కట్టబోతున్నాడు. చాందినిసందీప్ నాలుగేండ్లు గా డేటింగ్ లో ఉన్నారట. షార్ట్ ఫిలిమ్స్ తో స్టార్ట్ అయినా వీరి స్నేహం ప్రేమగా మారింది. దీంతో పెద్దలు వీళ్లకు పెళ్లి ఫిక్స్ చేశారు. నిన్న వైజాగ్ బీచ్ రిసార్ట్ లో ఘనంగా ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.

Tags

Next Story