Priyanka Chopra : వచ్చే ఏడాది వస్తున్నా : ప్రియాంక చోప్రా బాలీవుడ్ రీ ఎంట్రీ

Priyanka Chopra  : వచ్చే ఏడాది వస్తున్నా : ప్రియాంక చోప్రా బాలీవుడ్ రీ ఎంట్రీ
X

నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో తీరిక లేకుండా గడుపుతోంది. ఆమె బాలీవుడ్ రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందా..? అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఆమె ఒక అప్డేట్ ఇచ్చింది. వచ్చే ఏడాది వస్తున్నానని ప్రకటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె వచ్చే ఏడాది ఒక హిందీ చిత్రాన్ని ప్రకటించబోతున్నట్లు తెలిపింది. భారతీయ సినిమాలు తన గుండెకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాయని చెప్పింది. తనకు కూడా బాలీవుడ్లోకి తిరిగి రావాలని ఆసక్తిగా ఉంది. ప్రస్తుతం ఒక హిందీ సినిమాకు సంతకం చేసే పనిలోనే ఉన్నానని పేర్కొంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రేక్షకులందరూ ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. అందరి అంచనాలను మించేలా సినిమా ఉంటుందని చెప్పింది. వచ్చే ఏడాది పూర్తి వివరాల్ని అధికారికంగా ప్రకటిస్తానని వెల్లడించింది. తాను 18ఏళ్ల వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చానని, అప్పటి నుంచి ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాని తెలిపింది.

Tags

Next Story