Balakrishna Unstoppable: బాలయ్య విత్ ప్రభాస్.. క్రేజీ కాంబినేషన్

Balakrishna Unstoppable: బాలయ్య విత్ ప్రభాస్.. క్రేజీ కాంబినేషన్
X
Balakrishna Unstoppable: అన్ స్టాపబుల్.. నందమూరి బాలకృష్ణ మొదటిసారి హోస్టింగ్ చేస్తున్నాడు అన్నప్పుడు చాలా కమెంట్స్ వచ్చాయి.

Unstoppable: అన్ స్టాపబుల్.. నందమూరి బాలకృష్ణ ఫస్ట్ టైమ్ హోస్టింగ్ చేస్తున్నాడు అన్నప్పుడు చాలా కమెంట్స్ వచ్చాయి. బట్ మొదటి షోకే అవన్నీ ఎగిరిపోయాయి. ఆ రేంజ్ లో ఆకట్టుకున్నాడు బాలయ్య. ప్రస్తుతం ఆహా ప్లాట్ ఫామ్ లో బిగ్ హిట్ అనిపించుకున్న ఈ షోకి వస్తోన్న గెస్ట్ లు కూడా ప్రత్యేకంగానే ఉంటున్నారు. ఇక తన ఇమేజ్ ను మర్చిపోయి అందరితోనూ కలిసిపోతూ అన్ని విషయాలూ అడిగేస్తోన్న బాలయ్య షోకు ఈ సారి డార్లింగ్ స్టార్ ప్రభాస్ వస్తున్నాడట. ప్రభాస్ తో పాటు అతని బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ కూడా ఉంటాడు అంటున్నారు.

కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడూ క్రేజీగానే ఉంటాయి. అది సినిమా అయినా.. మరో వేడుక అయినా.. ఆకట్టుకుంటాయి. అలాంటి క్రేజీ స్టార్స్ కలిసి కాసేపు కనిపించినా.. ఆసక్తిగా చూస్తారు జనం. అలాంటి క్రేజీ కాంబినేషన్ గా బాలయ్య, ప్రభాస్ ను చెప్పొచ్చు. ఈ ఇద్దరూ కలిసి నటించలేదు. కానీ కలిసి అన్ స్టాపబుల్ లో కనిపించబోతున్నారు.


నిజానికి తన రేంజ్ మారిన తర్వాత ఇలాంటి టాక్ షోస్ కు అటెండ్ కాలేదు ప్రభాస్. అందుకే ఇది మరింత క్రేజీగా అనిపిస్తోంది. రీసెంట్ గా ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించినప్పుడు బాలయ్య సతీసమేతంగా వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. బాలయ్య కు ఉన్న ఇమేజ్ వల్ల వచ్చే గెస్ట్ లు ఏ స్టేటస్ లో ఉన్నా.. ఈయన మాత్రం అన్ని విషయాలూ ధైర్యంగా అడిగేస్తున్నాడు.


అది ఆయన నైజం కూడా కావడంతో చాలా సహజంగా ఉందీ షో. ఇక ప్రభాస్ ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోలేదు. రకరకాలు రూమర్స్ కూడా వస్తుంటాయి. మరి ఈ షోకు అతను వస్తే ఖచ్చితంగా ఆ విషయం గురించి అడిగేస్తాడు బాలయ్య.


ఇక గోపీచంద్, ప్రభాస్ వర్షం సినిమా కంటే ముందు నుంచే ఈ ఇద్దరూ స్నేహితులు. వర్షం తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు.

Tags

Next Story