Rebal Star Prabhas : కన్నప్పలో ప్రభాస్ పై క్రేజీ అప్డేట్

విష్ణు మంచు టైటిల్ రోల్ చేస్తూ నిర్మించిన సినిమా కన్నప్ప. 1976లో ఈ కథతో బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు హీరోగా సినిమా వచ్చింది. కన్నడలోనూ రాజ్ కుమార్ హీరోగా అదే కథతో సినిమా చేశాడు. ఇన్నాళ్లకు విష్ణు కన్నప్ప కథతో సినిమా చేస్తున్నాడు. విష్ణు తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అయితే బడ్జెట్ లో మేజర్ షేర్ రెమ్యూనరేషన్స్ గా కనిపిస్తుండటం విశేషం. ఎందుకంటే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో పాటు ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, కాజల్, శరత్ కుమార్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ లో రూపొందిస్తున్నారీ చిత్రాన్ని. అయితే ఇందులో ప్రభాస్ నటిస్తున్నాడా లేదా అనే డౌట్ చాలామందిలో ఉంది. బట్ అది నిజం కాదు అనే వార్తతో పాటు మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కన్నప్పలో ప్రభాస్ పరమశివుడి వాహనం నంది పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ పాత్ర పరిచయంలో ఓ పాట కూడా ఉంటుందట. ఆ పాట చిత్రీకరణ కూడా పూర్తయిందని తాజాగా ఢీ అనే డ్యాన్స్ షోలో గెస్ట్ గా ఉన్న గణేష్ మాస్టర్ చెప్పాడని.. యాంకర్స్ లో ఒకడైన ఆది చెప్పడం విశేషం. దీంతో ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తుండటమే కాదు.. ఆయనకు సోలోగా ఓ పాట కూడా ఉన్న విషయం తెలిసిపోయింది. అక్షయ్ కుమార్ శివుడుగా కాజల్ పార్వతీ దేవిగా నటిస్తోన్న మూవీలో ప్రభాస్ నందీశ్వరుడుగా కనిపిస్తాడన్నమాట.
ఇక ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ సంగీతం చేస్తున్నాడు. షెల్డన్ చౌ సినిమాటోగ్రాఫర్. మొత్తంగా కన్నప్పలో ప్రభాస్ గురించి ఆది చెప్పిన ఈ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తోందిప్పుడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com