Daku Maharaj : డాకు మహారాజ్ .. అసలు విషయాన్ని రివీల్ చేసిన బాబీ

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సరికొ త్త చిత్రం 'డాకు మహారాజ్'. ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డాలస్లో గ్రాండ్ స్కేల్లో జరిగింది. టెక్సాస్ ట్రస్ట్ థియేటర్ వేదికగా ట్రైలర్ లాంచ్ చేసింది. 'అనగనగా ఒక రాజు ఉండేవాడు. చెడ్డవాళ్లంతా ఆయన్ని డాకు అనేవాళ్లు. మాకు మాత్రం మహారాజు' అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. బాలయ్య నటన, యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ప్రదర్శన, సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. బాలకృష్ణను ఉద్దేశించి 'ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్' అంటూ చిన్నారి చెప్పే డైలాగ్స్ పవర్పుల్ ఉన్నాయి. చివర్లో ఎవడ్రా నువ్వు అని విలన్ అడిగినప్పుడు 'మైఖేల్ జాక్సన్' అని బాలయ్య చెప్పిన డైలాగ్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచింది. తమస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. బాబీ డైరెక్షన్లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన డాకు మహరాజ్ చిత్రంలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. వారిద్దరితోపా టు బాబీ డియోల్, చాందిని చౌదరి ముఖ్యపాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక డైరెక్టర్ బాబీ..'డాకు మహారాజ్' సినిమాకు సంబంధించి షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ఈ మూవీ స్క్రిప్ట్ రాసే టైంలో మరో కీలక పాత్ర కోసం దుల్కర్ సల్మాన్ ను తీసుకోవాలనుకున్నాం. కానీ తర్వాత కథకు ఆ పాత్ర అవసరం లేకపోవడంతో దుల్కర్ సినిమాలో భాగం కాలేదని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com