Daku Maharaj : రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘డాకు మహారాజ్’

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.105 కోట్లు (గ్రాస్) కలెక్షన్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘కింగ్ ఆఫ్ సంక్రాంతి’ అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. కాగా, ఈ సినిమా రేపటి నుంచి తమిళంలోనూ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ బాణీలు అందించారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటించారు.
మరోవైపు విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కలెక్షన్లలో దూసుకెళ్తోంది. రెండు రోజుల్లోనే రూ.77 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈరోజు కూడా బుక్ మై షోలో వేలల్లో టికెట్స్ బుక్ అవడంతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. మూవీలో వెంకీ కుటుంబం చేసిన కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను తెగ మెప్పిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com