Daku Maharaj : డాకు మహరాజ్ న్యూ లుక్.. అదిరిపోయిందిగా

బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా డాకు మహారాజ్' సంక్రాంతి రేసులో థియేటర్స్ లోకి వస్తోంది. హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ మూవీ కథ ఉండబోతోంది. ఇప్పటికే మూవీ టీజర్ ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. ఈ మూవీ ప్రమోషన్స్ ని మేకర్స్ షురూ చేస్తున్నారు. దానికి సంబందించిన షెడ్యూల్ కూడా ఖరారు అయిపొయింది. జనవరి 2న మూవీ ఈవెంట్ జెఆర్సీ కన్వెన్షన్ లో ఉండబోతోందని తెలుస్తోంది. తరువాత 3, 4 తేదీలలో యూఎస్ లోని డల్లాస్ లో 'డాకు మహారాజ్' మెగా ఈవెంట్స్ ఉంటాయంట. జనవరి 8న ఏపీలో మెగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిం చబోతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తం గా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఇవాళ విడుదల చేశారు మేకర్స్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com