Daku Maharaj on OTT : ఓటీటీలో డాకు మహరాజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా డాకు మహరాజ్. ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 170 కోట్లకు పైగా వరకు గ్రాస్, రూ.85 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. లాంగ్ రన్లో వంద కోట్ల షేర్ కలెక్షన్స్ను డాకు మహారాజ్ ఈజీగా రాబడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాతో బాలయ్య వరుసగా నాలుగు వంద కోట్లు కొల్లగొట్టి సీనియర్ హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేశారు.
ఈ సినిమా ఓ వైపు థియేటర్లో డాకు దుమ్ముదులిపేస్తుంటే, మరోవైపు ఈ సినిమా ఓటిటి డేట్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 9న డాకు మహారాజ్ ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగు తోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అయితే నెట్ ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మించగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com