Daku Maharaj OTT : డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

నందమూరి బాలకృష్ణ నటించిన మూవీ డాకు మహారాజ్. బాబీ కొల్లి డైరెక్షన్లో సంక్రాంతి కానుకగా జనవరి 12 థియేటర్ల లోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రజ్ఞా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్లో మెరిశారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో మెప్పించారు. బా క్సాఫీస్ వద్ద హిట్ టాక్ రావడంతో ఓటీటీ కోసం సినీ ప్రియులు, నందమూరి బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓటీటీ విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఈ సినిమా రైట్స్ దక్కించుకు న్న నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేసింది. ఈనెల 21 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించింది. 'అనగ నగా ఒక రాజు.. చెడ్డవాళ్లందరూ డాకు అనేవాళ్లు.. మాకు మాత్రం మహారాజ్' అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ విష యాన్ని పంచుకుంది. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెం ట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com