Daku Maharaj : డాకు మహరాజ్.. మూడు ఈవెంట్లు

Daku Maharaj : డాకు మహరాజ్.. మూడు ఈవెంట్లు
X

బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న సినిమా డాకు మహరాజ్. ఈ సినిమా సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాబీ దేవోల్, చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా నుంచి రెండో పాట రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. డాకు మహరాజ్ సినిమా ప్రమోషన్ కోసం మూడు గ్రాండ్ ఈవెంట్లు ప్లాన్ చేసినట్టు నిర్మాత నాగవంశీ చెప్పారు. జనవరి 2న హైదరాబాద్ లో ట్రైలర్ రిలీజ్ చేయాలనుకుంటున్నామని చెప్పారు. తర్వాత రెండు రోజులకు అమెరికాలో ప్రీరిలీజ్ ఈవెంట్ చేసి అక్కడ ఓ పాటను విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు. జనవరి 8న ఆంధ్రప్రదేశ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నామని, ఈ ఈవెంట్ విజయవాడ, మంగళగిరిల్లో ఉండే అవకాశం ఉందని తెలిపారు.

Tags

Next Story