Darling Re-Release : డార్లింగ్ కూడా రీ రిలీజ్ అవుతోంది
వర్షం తర్వాత ప్రభాస్ మోస్ట్ లవబుల్ కనిపించిన సినిమా డార్లింగ్. ప్యూర్ లవ్ స్టోరీగా అతని ఇమేజ్ కు పూర్తి భన్నంగా కనిపించిన ఈ మూవీ రిలీజ్ టైమ్ లో కమర్షియల్ గా పెద్ద విజయం సాధించలేదు కానీ తర్వాత చాలామందికి లైబ్రరీ మూవీ అయిపోయింది. అంటే ఎప్పుడు చూసినా బోర్ కొట్టని సినిమాగా నిలిచింది. ప్రభాస్, కాజల్ కెమిస్ట్రీకి జనం ఫిదా అయ్యారు. జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కు తోడు.. లవ్ స్టోరీస్ ను బాగా హ్యాండిల్ చేస్తాడు అన్న కరుణాకరన్ మ్యాజిక్ ఈ మూవీని చాలామందికి మోస్ట్ ఫేవరెట్ గా మార్చింది. ఇక న్యూజీలాండ్ ఎపిసోడ్ అయితే ఎంటర్టైన్మెంట్స్ పీక్స్ అనిపించేలా ఉంటుంది. అయితే అదంతా ఫేక్ అని చివర్లో చెప్పడం అప్పటి ఆడియన్స్ కు పెద్దగా నచ్చలేదు. కమర్షియల్ గా అనుకున్నంత రేంజ్ కు వెళ్లకపోవడానికి ఇదీ ఓ కారణం.
ఇక సెకండ్ హాఫ్ లో చంద్ర మోహన్ కూతురు లవ్ గురించి అతనికి చెప్పే సీన్ బెస్ట్ రైటింగ్ అని చెప్పాలి. ఓ రకంగా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ మూవీ. ఇప్పటికే యూ ట్యూబ్, టివిల్లో ఎన్నోసార్లు ఈ మూవీని చూసి ఉంటారు ప్రేక్షకులు. అయినా ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా 4కేలో అప్డేట్ చేసి రీ రిలీజ్ ట్రెండ్ లో డార్లింగ్ ను మళ్లీ విడుదల చేస్తున్నారు.
ఈ సెప్టెంబర్ 23న డార్లింగ్ రీ రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత నాలుగు రోజులకే ఎన్టీఆర్ దేవర ఉంది. అయినా ఈ నాలుగు రోజుల్లోనే రీ రిలీజ్ తో ఓ రేంజ్ లో వసూళ్లు సాధించే ప్రయత్నాలలో ఉన్నారు డార్లింగ్ ఫ్యాన్స్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com