Sharwanand : నారీ నారీ నడుమ మురారి నుంచి దర్శనమే సాంగ్ వచ్చేసింది

Sharwanand :  నారీ నారీ నడుమ మురారి నుంచి దర్శనమే సాంగ్ వచ్చేసింది
X

శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ టైటిల్ తో బాలకృష్ణ నటించిన మూవీ 1990లో రిలీజ్ అయి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఆ టైటిల్ ను శర్వానంద్ కోసం రిపీట్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాట కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా ఎదురుచూస్తుండటం విశేషం. ఈ పాట కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎందుకు చూస్తారూ అనుకుంటున్నారా.. దానికో రీజన్ ఉంది. ఇక పాట విషయానికి వస్తే రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ గీతాన్ని యాజిన్ నిజార్ పాడాడు. సినిమాకు విశాల్ భరద్వాజ్ సంగీతం అందించాడు.

హీరోయిన్ తో ప్రేమలో పడిన కుర్రాడు ఆ పారవశ్యాన్ని పంచుకుంటున్న సందర్భంలో వచ్చే పాటలా ఉంది. మాంటేజ్ సాంగ్ గా చిత్రీకరించారు. చూడగానే ఆకట్టుకునేలా ఉందీ పాట. ‘దర్శనమే మధురక్షణమే.. నీవూ నేనూ ఇక మనమే.. మనసున మోగే మంగళ నాదస్వరమే..’అంటూ సాగే ఈ పాట మంచి సాహిత్యంతో అర్థవంతంగా సాగుతోంది. ట్యూన్ ఆకట్టుకుంటోంది. సింపుల్ ఆర్కెస్ట్రైజేషన్ లో వినసొంపుగా ఉంది. డ్యాన్స్ సైతం బావుంది.

సామజవరగమనతో సూపర్ హిట్ అందుకున్న రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వాళ్లు నిర్మిస్తున్నారు. మే 16న విడుదల చేసే ప్లాన్ లో ఉంది మూవీ టీమ్. శర్వానంద్ కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ మూవీతో హిట్టెక్కే అవకాశాలున్నాయంటున్నారు. ఆరంభం నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. మరి శర్వానంద్ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.

ఇక ఈ మూవీ సాంగ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎందుకు ఎదురుచూస్తున్నారు అంటే.. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న ఫౌజీ చిత్రానికి కూడా విశాల్ చంద్రశేఖరే సంగీత దర్శకుడు. ఈ పాట చూస్తే అతని కెపాసిటీ ఏంటో తెలుస్తుంది కదా.. అందుకే వాళ్లూ చూస్తున్నారన్నమాట.

Tags

Next Story