NTR : ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి డేట్ ఫిక్స్

NTR : ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి డేట్ ఫిక్స్
X

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి డేట్ ఫిక్సయింది. ఆయన నటిస్తున్న వార్ 2 సినిమా విడుదల తేదీని బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ ప్రకటించాడు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ వార్ 2. ఇందులో తారక్ రా ఏజెంట్గా నటిం చనున్నట్లు తెలుస్తోంది. జాన్ అబ్రహాం, కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వార్ సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఈ మూవీ విడుదల తేదీ ఎప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు సాలిడ్ అప్డేట్ ను ప్రకటించా డు హృతిక్ రోషన్. ఇండిపెండెన్స్ డే కానుకగా.. ఆగస్టు 14న విడుదల చేస్తున్నట్లు తెలిపాడు. కాగా.. హృతిక్ రోషన్ తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొని వార్ 2 గురించి, ఎన్టీఆర్తో పని చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్టీఆర్ అద్భుతం. ఆయన మంచి కో యాక్టర్, అమేజింగ్ టీమ్ మేట్. మేం ఇద్దరం కలిసి వార్ 2 చేశాం.. మేం చేసిన అద్భుతాన్ని అందరూ చూడాలని ఎంతో ఎగ్జెటింగ్ వెయిట్ చేస్తున్నాను. ఒక పాట మినహా షూటింగ్ అంతా పూర్తయ్యింది. మా సినిమా అద్భుతంగా వచ్చింది. ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఎన్టీఆర్తో చేయాలంటే కాస్త నర్వెస్ట్ గా ఫీల్ అవుతున్నా' అని అన్నాడు. దీంతో ఆ వేదికంతా కేరింతలతో మారుమోగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.

Tags

Next Story