Samantha Family : సమంత కుటుంబంలో తీవ్ర విషాదం

Samantha Family : సమంత కుటుంబంలో తీవ్ర విషాదం
X

హీరోయిన్ సమంత కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సామ్ తన ఇన్ స్టా స్టోరీలో ఎమోషనల్‌ పోస్ట్ చేశారు. మనం మళ్లీ కలిసే వరకు, నాన్న” అంటూ హార్ట్ ఎమోజి జోడించింది. సమంత చెన్నైలో జోసెఫ్ ప్రభు, నీనెట్ ప్రభు దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి, తెలుగు ఆంగ్లో-ఇండియన్. తన జీవితంలో తన తండ్రి ముఖ్య పాత్ర పోషించారని గతంలో ఎన్నోసార్లు సామ్ చెప్పుకొచ్చింది. సినీరంగానికి వచ్చినప్పుడు తనకు ప్రతి క్షణం తన తండ్రి అండగా, మద్దతుగా నిలిచారని తెలిపింది. సామ్ తండ్రి మరణవార్త తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story