ఆమె నా అభిమాన నటి: ప్రభాస్
భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రం కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఓ సైన్స్ ఫిక్షన్. ఈ చిత్రంలో హెమాహెమీలు అయిన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, ప్రభాస్ వంటి తారలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర విశేషాలు పంచుకునేందుకు ప్రభాస్ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
దీపిక పదుకోన్ తో మొదటి సారి నటిస్తున్నారు కదా.. ఆమెతో నటించడం ఎలా ఉంది అని ప్రశ్నించగా.. ప్రభాస్ తన మనసులో మాట బయటపెట్టారు.ఆమె అద్భుతమైన నటి. ఇప్పటికే ఆమె ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. ఆమె ‘కల్కి’ సెట్స్‌లోకి అడుగుపెట్టిన ప్రతిసారి అందరిలోనూ ఉత్సాహం వస్తుంది. ఆమెతో కలిసి నటించాలని ఎప్పటి నుంచో అనుకునేవాడిని. ఇప్పటికి కుదిరింది’’ అని అన్నారు.
వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ని అమెరికాలో ఇటీవల జరిగిన ‘శాండియాగో కామిక్ కాన్’ వేడుకలో ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాకి సీక్వెల్ ఉంటుందేమో అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్న ప్రేక్షకులకు నాగ్ అశ్విన్ సమాధానమిస్తూ.. యానిమేటెడ్ వెర్షన్ చేయొచ్చేమో అని అన్నారు.. ఈ చిత్రాన్ని 2024 జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
600 కోట్ల భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రభాస్ ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ నటించిన చిత్రాలు కమర్షియల్ గా హిట్ కాక, ప్రేక్షకుల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకున్నాయి. ఈ క్రమంలో కల్కి చిత్రంపై ఆశలు పెట్టుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com