Deepika Padukone : దీపికా పదుకోణ్.. ఆ వార్తల్లో నిజం లేదు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతోన్న స్పిరిట్ మూవీలో తనను హీరోయిన్ గా తీసుకున్నాడు సందీప్. అయితే తన షూటింగ్ టైమ్ విషయంతో పాటు కొన్ని కండీషన్స్ పెట్టింది దీపికా. దీంతో తను ఆమె కండీషన్స్ కు ఒప్పుకోను అంటూ తనను కాదని.. యానిమిల్ లో హీరోయిన్ గా నటించిన తృప్తి దిమ్రిని హీరోయిన్ గా ఫైనల్ చేసుకున్నాడు. అయితే ఆ టైమ్ లో సందీప్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తన ప్రాజెక్ట్ నుంచి దీపికాను తప్పించానని.. ఆమెకు చెప్పిన కథంతా లీక్ చేసింది అంటూ సోషల్ మీడియాలో విరుచుకు పడ్డాడు. అట్నుంచి దీపిక సైతం అదే స్థాయిలో కౌంటర్స్ ఇచ్చే ప్రయత్నం చేసింది. సో.. ఇదంతా మళ్లీ ఎందుకూ అంటే.. ఈ కారణంగా దీపికా మరో ఆఫర్ ను కోల్పోయిందీ.. లేదా తనే వదులుకుందీ అనే న్యూస్ వస్తుండటమే. పైగా అది కల్కి కావడం వల్లే.
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి బాక్సాఫీస్ ను గెలుచుకుంది. ఇందులో దీపకా పదుకోణ్ పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. అయితే ప్రస్తుతం స్పిరిట్ మూవీ గొడవ కారణంగా మళ్లీ ప్రభాస్ తో నటించడం కష్టం అని భావించి దీపికా పదుకోణ్ ఈ మూవీ నుంచి తప్పుకుంది అనే వార్తలు రెండు రోజులుగా హల్చల్ చేస్తున్నాయి. అదే టైమ్ లో నాగ్ అశ్విన్ కూడా దీపికాను తప్పించి మరొకరిని తీసుకుంటున్నాడు అనే న్యూసూ వినిపించాయి. అయితే ఈ రెండు వార్తల్లోనూ నిజం లేదని దీపికా పీఆర్ టీమ్ నుంచి ఓ క్లారిటీ వచ్చింది.
కల్కి 2 కు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. పైగా దీపికా పాత్ర సెకండ్ పార్ట్ లో కూడా కీలకంగానే ఉంటుందనిపించేలా ఉంది. అంచేత తనను తప్పించి వేరే వారిని తీసుకునే ఆలోచన కల్కి టీమ్ కు లేదు. అలాగే తప్పుకోవాలన్న ఆలోచనా దీపికాకు లేదు. సో.. దీపికా పదుకోణ్ కల్కి 2 నుంచి తప్పుకుంది అనే వార్తలు ఇప్పటికైతే పూర్తిగా నిరాధారం అని చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com