Prabhas : ప్రభాస్ తో మరోసారి దీపిక పదుకోణ్ ..?

Prabhas :  ప్రభాస్ తో మరోసారి దీపిక పదుకోణ్ ..?
X

రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు కమిట్ అయ్యాడు. కానీ ఏది ఎప్పుడు విడుదలవుతుంది అనే క్లారిటీ మాత్రం కనిపించడం లేదు. కాకపోతే ముందుగా వచ్చేది రాజాసాబ్. ఈ సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని నిరవధికంగా వాయిదా వేశారు. కొత్త డేట్ ఎప్పుడు అనేది మాత్రం ఇప్పటి వరకూ చెప్పలేదు. అసలు ఈ యేడాది ఉంటుందా అనే డౌట్ కూడా చాలామందిలో ఉంది. మరోవైపు హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీతో ఇమాన్వి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఆపై ప్రశాంత్ వర్మతో సినిమా కూడా త్వరలోనే అనౌన్స్ కాబోతోంది. అయితే రాజా సాబ్ తర్వాత వెంటనే స్టార్ట్ కావాల్సిన స్పిరిట్ మాత్రం చాలా చాలా వెనక్కి వెళుతోంది. దీంతో ఓ వైపు అసలు ఈ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చు అనే వార్తలు కూడా వస్తోన్న తరుణంలో ఈ చిత్రంలో దీపికా పదుకోణ్ హీరోయిన్ గా నటించబోతోంది అనే న్యూస్ తాజాగా హల్చల్ చేస్తోంది.

ప్రభాస్ తో దీపికా పదుకోణ్ ఆల్రెడీ కల్కి చిత్రంలో నటించింది. కానీ వీరు జంటగా కనిపించలేదు. రెగ్యులర్ హీరో, హీరోయిన్ తరహా రొమాన్స్ కానీ, ఇతరత్రా అంశాలు కానీ ఏం లేవు. ప్రభాస్ హీరో. దీపికా ఓ ప్రధాన పాత్రలో నటించింది. అలాంటి ఈ కపుల్ ఈ సారి స్పిరిట్ లో నటించబోతున్నారు అనే న్యూస్ రావడంలో వింతేమీ లేదు. నిజానికి ఇప్పటికే స్పిరిట్ లో హీరోయిన్ అంటూ నాలుగైదు పేర్లు వచ్చాయి. ఇప్పుడు మరో పేరు యాడ్ అయింది అంతే. అంతే కానీ.. అసలు కాస్టింగ్ కు సంబంధించిన వర్క్ స్టార్ట్ అయిందా లేదా అనేది కూడా ఎవరికీ తెలియదు. సో.. ఇప్పటికైతే ఈ వార్తను రూమర్ గానే చూడాలి. మూవీ టీమ్ నుంచి ఎవరైనా రియాక్ట్ అయితే కానీ ఇందులో నిజమెంత అనేది తేలదు. అదీ మేటర్.

Tags

Next Story