Shannu Deepu Breakup: బ్రేకప్ చెప్పి వారం రోజులు.. దీప్తి ఎమోషనల్ పోస్ట్..

Deepthi sunaina (tv5news.in)
Shannu Deepu Breakup: షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునయన బ్రేకప్ అనేది యూట్యూబ్ కమ్యూనిటీలో పెద్ద సెన్సేషన్నే క్రియేట్ చేసింది. బిగ్ బాస్ 5 తెలుగులో షణ్నూ ప్రవర్తన చూసిన తర్వాత దీప్తి ఎలా రియాక్ట్ అవుతుందో అని ఎదురుచూసిన వారందరికీ ఆ బ్రేకప్ వార్త పెద్ద ఆశ్చర్యాన్ని ఏమీ ఇవ్వలేదు. అయితే దీప్తినే ముందు షణ్నూకు బ్రేకప్ చెప్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ పెట్టి వారం రోజులు అవుతుండడంతో దీప్తి సునయన మరో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
వారం రోజుల క్రితం షణ్నూది, తనది దారులు వేరు అంటూ దీప్తి సునయన ఒక పోస్ట్ పెట్టి అధికారికంగా బ్రేకప్ చెప్పేసింది. దీనికి షణ్నూ స్పందిస్తూ.. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని, తన నిర్ణయం ఏదైనా దానిని గౌరవిస్తానని వివరించాడు. ఆ తర్వాత నుండి ఇద్దరు ఇదివరకు లాగా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండట్లేదు. తాజాగా బ్రేకప్ చెప్పి వారం రోజులు అవుతుండడంతో వీక్ 1 అని క్యాప్షన్‌తో తన పది ఫోటోలను పోస్ట్ చేసింది దీప్తి సునయన.
ఫోటోలతో పాటు ఆ పోస్ట్‌లో కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. బ్రేకప్ చెప్పిన రెండు రోజుల తర్వాత ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొన్న దీప్తి సునయన.. తన కెరీర్ కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా స్పష్టం చేసింది. అయినా కూడా వారం రోజులకే ఇలా వీక్ 1 అంటూ ఎమోషనల్‌గా పోస్ట్‌లు పెట్టడం ఎందుకు అని కొందరు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. వీక్ 1తో పాటు 'నేను పులి.. మా డాడ్ అలా పెంచారు' అని కూడా క్యాప్షన్‌లో పెట్టింది దీప్తి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com