Sai Pallavi : ఎన్నోసార్లు మౌనంగా ఉన్నా .. భానుమతి వార్నింగ్

Sai Pallavi : ఎన్నోసార్లు మౌనంగా ఉన్నా .. భానుమతి వార్నింగ్
X

ఫిదా సినిమాతో బాన్సువాడ భానుమతిగా ఫేమ్ అయిన సాయిపల్లవి వరుస సినిమాతో బిజీగా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ లో రణబీర్ కపూర్ సాయిపల్లవి సీతారాముల పాత్రలో రామాయణ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం సాయి పల్లవి తన అలవాట్లను మార్చుకుందటూ వస్తోన్న వార్తలపై తాజాగా ఆమె ఘాటుగా స్పందించారు. ఇలాంటి నిరాధారమైన పోస్టు పెడితే లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నితేశ్ తివారీదర్శకత్వంలో 'రామాయణ'గా ఇది రానుంది. ఈ సినిమా కోసం ఆమె ఎన్నో అలవాట్లు మార్చుకున్నారని కోలీవుడ్లో ఓ ప్రముఖ మీడియా సంస్థ వార్తలు రాసింది. ఈ సినిమా పూర్తయ్యేవరకు సాయి పల్లవి మాంసాహారం మానేశారని, హోటల్లో కూడా తినడం లేదని, విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా వంట వాళ్లను వెంట తీసుకెళ్తున్నారని ఆ వార్తల సారాంశం. దీనిపై సాయిపల్లవి ఈ వార్తలపై స్పందించారు. ఇలాంటి నిరాధారమైన రూమర్స్ రాస్తే ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. తనపై ఎన్నోసార్లు రూమర్స్ వచ్చాయని, వాటికి మౌనంగా ఉన్నానని, నిజం దేవుడికి తెలుసని నమ్ముతానని అన్నారు. కానీ ఇప్పుడు ప్రతిస్పందించాల్సిన సమయం వచ్చిందని చెప్పింది. తన సినిమాల విడుదల, తన ప్రకటనలు, తన కెరీర్.. ఇలా నాకు సంబంధించి ఏవైనా నిరాధారమైన వార్తలు ప్రచురిస్తే.. అది గుర్తింపుపొందిన మీడియా అయినా తాను చట్టబద్దమైన యాక్షన్ తీసుకుంటానని అన్నారు. ఇన్నాళ్లు సహించానని ఇకపై ఆచెత్త కథనాలను మోసుకెళ్లడానికి నేను సిద్ధంగా లేనంటూ వార్నింగ్ ఇచ్చింది సాయిపల్లవి.

Tags

Next Story