Samantha : రిస్క్ తీసుకోకుండా అభివృద్ధిని ఆశించలేం : సమంత

'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కిస్తున్న మూవీ 'శుభం'. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా హీరోయిన్ సమంత నిర్మాతగానూ తొలి అడుగు వేసేందుకు 'సిద్ధమైన విషయం తెలిసిందే. తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈచిత్రం మే 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సామ్ మీడియాతో మాట్లాడుతూ 'రిస్క్ తీసుకోకుండా అభివృద్ధిని ఆశించలేం. నాకు సవా ళ్లను ఎదుర్కోవడం ఇష్టం.15 ఏండ్ల నా కెరీర్లో స్టోరీల గురించి తెలుసుకున్నాను. ఆ అనుభవం తోనే ప్రొడ్యూసర్ గా మారాను. నాకు మంచి టీమ్ దొరికింది. సినిమాలో భాగమైనప్పుడు నటిగా కంటే నిర్మాతగా ఎక్కువ బాధ్యతలు ఉంటాయని అర్థమైంది. ఎన్నో విషయాలను పరిశీలించా లి. అయితే ఒకే రకమైన చిత్రాలకు పరిమితం కావాలని నేను అనుకోవడం లేదు. ఎన్నో స్టోరీలకు వినడానికి రెడీ ఉన్నాను. రొటీన్ క్కు భిన్నమైన కథలను రూపొందిస్తా' అని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com