ధన్ రాజ్ డైరెక్షన్.. సముద్రఖని యాక్షన్.. అంతా రామ మయం ..

టాలీవుడ్ కమెడియన్ ధనరాజ్ (comedian dhanaraj) దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. కామెడీ సినిమా కాకుండా తండ్రీకొడుకుల కథతో సెంటిమెంట్, ఎమోషనల్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో బహుముఖ నటుడు సముద్రఖ కీలక పాత్ర పోషిస్తున్నారు. . ధనరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తు.. ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అయోధ్యలో రాముడి ప్రతిష్ట సందర్భంగా సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రానికి రామం..రాఘవం (ramam raghavam) అనే పేరు ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఇరవై ఇద్దరు ప్రముఖులు విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సుముద్రఖ, ధనరాజ్‌లు సీరియల్‌గా కనిపిస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్‌లో డిజైన్ చేసిన పోస్టర్ ఆసక్తిని కలిగిస్తుంది.
ఈ చిత్రంలో సముద్రఖని, ధనరాజ్ తండ్రీకొడుకులుగా కనిపించనున్నారు. ఇప్పటి వరకు తెలుగు తెరపై రాని డిఫరెంట్ ఎడ్జ్‌తో రామం..రాఘవం చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ధనరాజ్ తెలిపారు. ఈ చిత్రానికి అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తుండగా, చిత్ర దర్శకుడు శివప్రసాద్ యానాల కథను సమకూర్చారు. మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, శ్రీనివాస రెడ్డి, సినిమా శ్రీను ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ (Hyderabad) , చెన్నై (chennai), అమలాపురం (amalapuram), రాజమండ్రి (Rajahmundry), రాజోలులలో (Rajole) జరిగింది. రామం రాఘవం చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆరిపాక, పృథ్వీ పోలవరపు సమర్పణలో పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ నిర్మిస్తున్న చిత్రం రామం..రాఘవం
ముఖ్యంగా రామం..రాఘవం దర్శకుడిగా ధన్‌రాజ్‌కి మొదటి సినిమా. జై సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ధనరాజ్.. జగడం, పిల్ల జమీందార్, గబ్బర్‌సింగ్, రాజుగారి గది, భాగమతి వంటి చిత్రాల్లో కమెడియన్‌గా కనిపించాడు. భాగ్యనగర వీధుల్లో గమ్మత్తుతో పాటు మరో చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. జబర్ధస్త్‌తో పాటు అదిరింది, కామెడీ స్టార్స్ వంటి షోలలో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. అంతే కాకుండా బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ప్రవేశించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com