Dhanush : పవర్ స్టార్ తో సినిమా చేస్తా... ధనుష్ సంచలన ప్రకటన

శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మూవీ కుబేర. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కోలీవుడ్ నటుడు ధనుష్ బిచ్చగాడిగా పాత్ర పోషిస్తున్నారు, ఆయనతో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, ఫేమస్ యాక్టర్ జిమ్ సర్బ్ కూడా కీలక పాత్రలు పోషించారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా హైదరాబాద్లో నిర్వహించగా... ధనుష్ కూడా అటెండ్ అయ్యాడు. ఎప్పటిలాగే డీసెంట్ లుక్ లో సందడి చేశాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని అక్కడ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఈవెంట్ జరిగిన ప్రాంతమంతా చప్పట్లు, ఈలలతో దద్దరిల్లింది. ధనుష్ కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆయన అటు హీరోగా.. ఇటు డైరెక్టర్ గా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన.. ఇప్పుడు మరిన్ని సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం తన లైనప్లో ఉన్న మూడు సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్న పవర్ స్టార్.. కొత్త మూవీలు ఓకే చేస్తారో లేదో ఇంకా క్లారిటీ లేదు. మరి ధనుష్ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com