Dharmendra Passes Away: రూ.153 కోట్ల సంపద..జూహులో 126 కోట్ల బంగ్లా..ధర్మేంద్ర ఆస్తులకు వారసులెవరో తెలుసా ?

Dharmendra Passes Away: బాలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. హీ మ్యాన్ గా కోట్ల మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ధరం సింగ్ డియోల్ (ధర్మేంద్ర) ఇక లేరు. నవంబర్ 24న ఆయన తుదిశ్వాస విడిచారు. ముంబైలోని విలే పార్లే శ్మశాన వాటికకు డియోల్ కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు చేరుకున్నారు. ఈ కష్ట సమయంలో ధర్మేంద్ర సినీ ప్రయాణంలో కష్టపడి సంపాదించిన ఆస్తులు, సంపద వివరాల గురించి తెలుసుకుందాం. 2024లో ఆయన భార్య, ఎంపీ హేమమాలిని దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో ఈ వివరాలు పొందుపరిచారు.
హేమమాలిని ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. 2024 నాటికి ధర్మేంద్ర వద్ద ఉన్న చరాస్తుల వివరాలు చాలా భారీగా ఉన్నాయి.ఆయన వద్ద రూ. 43.19 లక్షలకు పైగా నగదు ఉంది. బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు, ఇతర ఆర్థిక సంస్థలలో ఆయన డిపాజిట్ చేసిన మొత్తం రూ.3.52 కోట్లకు పైగా ఉంది. ధర్మేంద్ర బాండ్లు, డిబెంచర్లు, కంపెనీల షేర్లలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు. ఈ పెట్టుబడుల మొత్తం విలువ రూ. 4.55 కోట్లకు పైగా ఉంది. ఈ పెట్టుబడుల విలువ అఫిడవిట్ తర్వాత పెరిగే అవకాశం ఉంది.
ఆయన వద్ద కోటి రూపాయలకు పైగా విలువైన బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి. మొత్తంగా ధర్మేంద్రవద్ద రూ. 17.15 కోట్లకు పైగా చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడైంది. ఇది అప్పట్లో హేమమాలిని చరాస్తుల విలువ (రూ.12 కోట్లకు పైగా) కంటే ఎక్కువ. ధర్మేంద్ర స్థిరాస్తుల విలువ కూడా భారీగా ఉంది, వాటిలో ముఖ్యమైనది ఆయన బంగ్లా.
ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, ముంబైలోని జూహు ప్రాంతంలో ఆయన పేరిట ఉన్న బంగ్లా విలువ రూ.126 కోట్లు. అలాగే ఆయన పేరిట రూ.9.36 కోట్లకు పైగా విలువైన వ్యవసాయేతర భూమి కూడా ఉంది. మొత్తంగా, ధర్మేంద్ర గారి వద్ద ఉన్న స్థిరాస్తుల విలువ రూ. 136 కోట్లకు పైగా ఉంది. ఈ విలువ కూడా హేమమాలిని స్థిరాస్తుల విలువ (రూ.113 కోట్లు) కంటే ఎక్కువ. ఆస్తుల ధరలు ప్రతి సంవత్సరం పెరుగుతాయి కాబట్టి, ప్రస్తుత మార్కెట్ విలువ మరింత ఎక్కువ ఉండవచ్చు.
ఎన్నికల అఫిడవిట్ వివరాల ప్రకారం.. ధర్మేంద్ర మొత్తం ఆస్తి విలువ రూ. 153 కోట్లకు పైగా ఉంది. ఆయన భార్య హేమమాలిని మొత్తం ఆస్తి విలువ రూ. 125.70 కోట్లకు పైగా ఉంది. ఈ లెక్కల ప్రకారం ధర్మేంద్ర తన భార్య కంటే ఎక్కువ సంపన్నుడిగా ఉన్నారు. ఆయన మరణం తర్వాత ఈ భారీ ఆస్తులన్నింటికీ వారసులు ఎవరు అనే చర్చ మొదలైంది. ఇది ఆయన విల్ లేదా చట్టపరమైన నిబంధనల ప్రకారం ఆయన కుమారులు (సన్నీ డియోల్, బాబీ డియోల్, ఇషా డియోల్, అహనా డియోల్), కుటుంబ సభ్యులకు చెందుతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

