Prabhas : ప్రభాస్ స్పిరిట్ ను పక్కన పెట్టాడా..

Prabhas : ప్రభాస్ స్పిరిట్ ను పక్కన పెట్టాడా..
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి రూపొందించాలనుకున్న స్పిరిట్ మూవీ ఆగిపోయిందా..? ఆ స్థానంలో మరో కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాడా.. ?

డార్లింగ్ స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తోంటే అతని దూకుడుకు చాలామంది షాక్ అవుతున్నారు. వరుసగా బ్లాక్ బస్టర్స్ కొడుతూ దూసుకుపోతోన్న డార్లింగ్ ఈ ఎనిమిది నెలల్లోనే సలార్, కల్కితో రెండు సూపర్ హిట్స్ కొట్టాడు. నెక్ట్స్ ఇయర్ కూడా మరో రెండు సినిమాలు రిలీజ్ అవడం గ్యారెంటీ అనేలా ఉంది. వాటిలో మారుతి డైరెక్ట్ చేస్తోన్న రాజా సాబ్ తో పాటు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కూడా ఉంటుందనుకున్నారు. బట్ లేటెస్ట్ గా సందీప్ కు షాక్ ఇచ్చాడు డార్లింగ్. స్పిరిట్ ను పక్కన పెట్టాడు. మామూలుగా అయితే ఈ మూవీ ఈ యేడాది చివర్లో ప్రారంభం అవుతుందనుకున్నారు. కానీ సందీప్ కంటే బెటర్ స్క్రిప్ట్ రావడంతో ముందు దానికే ప్రియారిటీ ఇవ్వబోతున్నాడు.

మామూలుగా కల్కి తర్వాత మారుతితో పాటు సందీప్ రెడ్డికే కమిట్ అయ్యాడు ప్రభాస్. తర్వాత సీతారామం ఫేమ్ హను రాఘవపూడి చెప్పిన లైన్ కు ఓకే చెప్పాడు. అయితే హను చాలా వేగంగా బౌండ్ స్క్రిప్ట్ తో రెడీ కావడమే కాదు.. ప్రభాస్ కు నెరేషన్ ఇచ్చాడు. వినగానే ముందు ఈ మూవీకే నా ఓటు అనేశాడు ప్రభాస్. దీంతో సందీప్ రెడ్డి స్పిరిట్ మూవీ వెనక్కి వెళ్లింది. అలాగని పూర్తిగా పక్కన పెట్టేయలేదు. సందీప్ కూడా బౌండ్ స్క్రిప్ట్ తో వస్తే నెక్ట్స్ ఇయర్ లో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి రెడీ అన్నాడట. కాకపోతే సందీప్ ఇంకా పూర్తి స్క్రిప్ట్ తో రెడీగా లేడు అని అతనే చెబుతున్నాడు.

సో.. యానిమల్ తర్వాత సందీప్.. ప్రభాస్ ను ఎలా చూపిస్తాడా అని ఈగర్ గా ఎదురుచూస్తున్న వారికి ఇది కొంత డిజప్పాయింటింగ్ న్యూస్ అనే చెప్పాలి. బట్ హను రాఘవపూడి కూడా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో యుద్ధ నేపథ్యంలో కథతో వస్తున్నాడు. ఇలాంటి కథఇప్పటి వరకూ తెలుగులో రాలేదు అంటున్నారు. మరి అలాంటి స్టోరీకి ప్రభాస్ లాంటి కటౌట్ యాడ్ అయితే ఇంకెన్ని రికార్డ్ లు క్రియేట్ అవుతాయో ఆలోచించండి.

ఇక ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఈ యేడాదే సెట్స్ పైకి వెళుతుందంటున్నారు. ప్రస్తుతం హీరోయిన్ తో పాటు ఇతర కాస్టింగ్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడట దర్శకుడు హను రాఘవపూడి.

Tags

Next Story