Bollywood : ప్రియాంక - షాహిద్ కపూర్ గురించి ఈ విషయాలు తెలుసా..?

Bollywood : ప్రియాంక - షాహిద్ కపూర్ గురించి ఈ విషయాలు తెలుసా..?
X

బాలీవుడ్‌కు దూరంగా ఉన్నప్పటికీ, నటి ప్రియాంక చోప్రా తన అభిమానులలో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. ఆమె తన భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్టి మేరీతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతోంది. కానీ ఒకప్పుడు ప్రియాంక, నటుడు షాహిద్ కపూర్ మధ్య సంబంధం చర్చనీయాంశమైంది. వారి సంబంధం పెళ్లి వరకు వెళ్ళి ఆగిపోయింది. ఇవాళ ప్రియాంక బర్త్ డే.. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

ప్రియాంక, షాహిద్ కలిసి చాలా సినిమాల్లో నటించారు. తెరపై కూడా వారి కెమిస్ట్రీ అభిమానులకు బాగా నచ్చింది. సినిమాలు కాకుండా, ఇద్దరూ చాలా చోట్ల కలిసి కనిపించారు. వారి సంబంధం వేరే మలుపు తీసుకునే ముందు, ఒక పెద్ద సంఘటన జరిగడంతో ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఓ రోజు తెల్లవారుజామున ప్రియాంక ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఆ సమయంలో షాహిద్ ప్రియాంక ఇంట్లో ఉన్నాడు. అధికారులు తలుపు తట్టగానే, షాహిద్ దానిని తెరిచాడు.

ఈ సంఘటన తర్వాత, ప్రియాంక, షాహిద్ సంబంధం గురించి బయట తెలిసింది. కానీ వారి సంబంధం ఎక్కువ కాలం నిలవలేదు. కొంత సమయం తర్వాత, ప్రియాంక షాహిద్ నుండి దూరం కావడం ప్రారంభించింది. చివరికి ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ వేరు వేరు పెళ్లిళ్లు చేసుకుని హ్యాపీగా ఉంటున్నారు. ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్‌లో బిజీగా ఉంది. మహేశ్ బాబు - రాజమౌళి సినిమాలోనూ నటిస్తోంది.

Tags

Next Story