Simrat Kaur : డిజిటల్ వల్ల ఇండస్ట్రీకి లాభం : సిమ్రత్ కౌర్

‘ప్రేమతో మీ కార్తీక్' తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నార్త్ బ్యూటీ సిమ్రత్ కౌర్. ఫస్టూ మూవీతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈముద్దుగుమ్మ .. ఆతర్వాత పరిచయం, డర్టీ హరి చిత్రాల్లో తన నటనతో కుర్రాళ్ల మనసును దోచుకుంది. బంగార్రాజు సినిమాలో అక్కినేని నాగ్ తో కలిసి స్పెషల్ సాంగ్ లో ఆడిపాడి తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసింది. 'సోని'తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. గదర్ 2 చిత్రంలోనూ నటనతో మెప్పించింది. తాజాగా ఈభామ ఇంట్రెస్టింగ్ విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. ‘కొన్ని సినిమాల స్టోరీ బాగున్నప్పటికీ ఓటీటీలో వచ్చే వరకు ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. థియేటర్లో చూసేవారి కంటే ఓటీటీలో చూసే వారి సంఖ్య పెరుగుతోంది. పెద్ద సినిమాలైతే ఓటీటీ వేదికగా విడుదల చేయాలనే ఆలోచనే దర్శక నిర్మాతలకు రాదు. గతంలో లవ్ స్టోరీ అయినా.. యాక్షన్ కథైనా ఏదైనా థియేటర్లలోనే విడుదలయ్యేవి. ఇప్పుడు ఆ ఆలోచనలు మారిపోయాయి. ప్రేక్షకులు చిన్న సినిమాలను ఓటీటీ లోకి వచ్చాక చూడొచ్చనుకుంటున్నారు. అందుకే డిజిటల్ వల్ల ఇండస్ట్రీకి లాభం ఎంత ఉందో.. అంతేమేర నష్టమూ ఉంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రేక్షకుల ఆలోచన లోనూ మార్పు వచ్చింది. 'యానిమల్', 'గదర్2' వంటి యాక్షన్ చిత్రాలను బిగ్ స్క్రీన్ పై చూడడానికే ఇష్టపడుతున్నారు. 12th ఫెయిల్, లాపతా లేడీస్ వంటి చిత్రాల కథ బాగున్నప్పటికీ ఓటీటీల్లోనే ఆదరణ సొంతం చేసుకోవడానికి ఇదీ ఒక కారణం. ఎందుకంటే అవి యాక్షన్ చిత్రాలు కాదు కాబట్టి బలమైన కథనం ఉన్నప్పటికీ ప్రేక్షకులు వాటిని ఓటీటీలోనే చూస్తరు' అని సిమ్రత్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com