Dil Raju : కొత్తవారి కోసం దిల్ రాజు డ్రీమ్స్

చిత్ర పరిశ్రమలో కొత్త వాళ్లను, కొత్త కంటెంట్‌ను ప్రోత్సహించేందుకే ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాను. దర్శక, నిర్మాతలు, హీరో, హీరోయిన్లు, రచయితలు ఇలా ఏ రంగంలో ఆసక్తి ఉన్న వారైనా మా టీమ్‌ని సంప్రదించవచ్చు’’ అని నిర్మాత దిల్ రాజు తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ‘దిల్ రాజు డ్రీమ్స్’ లోగోను విడుదల చేశారు. ఈ సందర్బంగా అయాన ,మాట్లాడుతూ ‘‘ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు వచ్చినట్టు, పోయినట్టు కూడా తెలియడం లేదు. అలా ఎంతో డబ్బు వృథా చేసుకుంటున్నారు. ఈ డ్యామేజ్‌ని కంట్రోల్ చేయాలని, ప్రతిభ ఉన్న కొత్తవారికి సరైన వేదిక ఉండాలని ‘దిల్ రాజు డ్రీమ్స్’ను స్థాపించాను. ఇప్పటికే ఇద్దరు ఎన్నారై నిర్మాతలు దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా రెండు ప్రాజెక్టులు చేస్తున్నాను. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తాం. మంచి ప్రతిభావంతులకు నా బ్యానర్‌లో సినిమా చేసే అవకాశం కూడా ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com