Dil Raju : ప్రభాస్‌కి సారీ చెప్పిన దిల్ రాజు..!

Dil Raju : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి సారీ చెప్పారు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రభాస్, దిల్ రాజుకి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ సినిమాలను దిల్ రాజు పలు ఏరియాల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ప్రభాస్, దిల్ రాజు కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ మున్నా.. ఈ సినిమాతోనే వంశీ పైడిపల్లి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.. అయితే అప్పటికే బ్యాడ్ ఫామ్‌లో ఉన్న ప్రభాస్‌కు ఈ సినిమా మరింత దెబ్బ తీసింది.
ఈ సినిమాని సుదర్శన్ 35ఎంఎంలో చూసిన వెంటనే ప్రభాస్ దగ్గరకు వెళ్లి 'సారీ ప్రభాస్ నీకు హిట్ ఇవ్వలేకపోయాను' అంటూ బాధపడ్డారట దిల్ రాజు.. ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీతో ఆ లోటును తీర్చుకున్నారు దిల్ రాజు.. యూత్, ఫ్యామిలీస్‌లో ప్రభాస్‌కి ఉన్న ఫాలోయింగ్‌తో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.. అప్పటికి ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా మిస్టర్ పర్ఫెక్ట్ నిలిచింది.
అయితే ముందుగా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్‌ని హీరోయిన్‌గా అనుకున్నామని, అయిదు రోజులు షూటింగ్ కూడా చేశామని దిల్ రాజు వెల్లడించారు. ఇక 'ఆర్య' సినిమా కథకు అల్లు అర్జున్ కంటే ముందు రవితేజ, ప్రభాస్ సహా చాలా మంది హీరోలు వినిపించామని దిల్ రాజు తెలిపారు.
ఇదిలావుండగా ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ కాంబోలో రాబోతున్న మూవీకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది దిల్ రాజుకి 50వ చిత్రం కావడం విశేషం. సర్కారోడు అనే టైటిల్‌ని అనుకుంటున్నారు మేకర్స్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com