Radhe Shyam: 'రాధే శ్యామ్'లో ఇంటర్వెల్ సీన్ ఏదో చెప్పేసిన దర్శకుడు..

Radhe Shyam: రాధే శ్యామ్లో ఇంటర్వెల్ సీన్ ఏదో చెప్పేసిన దర్శకుడు..
Radhe Shyam: దర్శకుడు రాధాకృష్ణ కుమార్ మూవీ రిలీజ్ కన్ఫర్మ్ అయినప్పటి నుండి ట్విటర్‌లో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటున్నాడు.

Radhe Shyam: ప్రస్తుతం టాలీవుడ్‌లో 'రాధే శ్యామ్' మ్యానియా నడుస్తోంది. ఎంతోకాలంగా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మూవీ లవర్స్ అంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ఓ ప్రేమకథలో నటించి చాలాకాలమే అయ్యింది. అయితే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రేమకథపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా సోషల్ మీడియాలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాధే శ్యామ్‌లో ఇంటర్వెల్ సీన్ ఏదో చెప్పేశాడు దర్శకుడు.

'రాధే శ్యామ్' రిలీజ్‌కు ఇంకా కొన్నిరోజులే టైమ్ ఉంది. అందుకే మూవీ టీమ్ అంతా రాష్ట్రాలన్నీ చుట్టేస్తూ ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో చేసేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా రాధే శ్యామ్ గురించి ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను వారితో పంచుకుంటున్నారు. ఇప్పటికే రాధే శ్యామ్ ట్రైలర్స్ యూట్యూబ్‌లో రికార్డులు బ్రేక్ చేయడంతో పాటు ప్రేక్షకులలో అంచనాలను అమాంతం పెంచేశాయి.


దర్శకుడు రాధాకృష్ణ కుమార్ మూవీ రిలీజ్ కన్ఫర్మ్ అయినప్పటి నుండి ట్విటర్‌లో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటూ ప్రేక్షకులతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు. తాజాగా ఓ నెటిజన్.. 'సినిమాలో ఇంటర్వెల్ సీన్ ఏంటో ఒక్క ఎమోజీతో చెప్పు అన్న' అని అడగగా.. దానికి రాధాకృష్ణ.. ఆర్చరీ ఎమోజీను బదులుగా ఇచ్చాడు. అయితే రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్‌లో చూపించినట్టుగా రిద్ధి కుమార్ వర్షంలో ఆర్చరీ ఆడుతున్న సీన్‌నే ఇంటర్వెల్ సీన్ అని అంచనా వేస్తున్నారు నెటిజన్లు.



Tags

Read MoreRead Less
Next Story