Director Shankar : బయోపిక్ తీయాలనుకుంటే రజినీకాంత్‌పైనే: స్టార్ శంకర్
ఒకవేళ తాను గనుక బయోపిక్ తీస్తే రజినీకాంత్ సార్‌ది తెరకెక్కిస్తానని దర్శకుడు శంకర్ చెప్పారు. ఆయనొక గొప్ప వ్యక్తి అని, ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసని చెప్పారు. శంకర్ వ్యాఖ్యలు రజినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన శివాజీ, రోబో, రోబో 2.0 సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టించాయి. ఐతే శంకర్ డైరెక్షన్ లో రజిని బయోపిక్ అనగానే దానికి సూటయ్యే హీరో ఎవరని సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి. ఒక సాధారణ కండక్టర్ గా జీవితాన్ని మొదలు పెట్టి సూపర్ స్టార్ గా ఎదిగిన తీరు తెలిసిందే. ఐతే ఒక సూపర్ హిట్ సినిమాకు కావాల్సిన సబ్జెక్ట్ రజిని జీవిత కథలో ఉంది. కామన్ టు సూపర్ స్టార్ గా ఎదిగిన సూపర్ స్టార్ బయోపిక్ అది శంకర్ లాంటి డైరెక్టర్ చేస్తే మాత్రం అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ప్రస్తుతం శంకర్ గేమ్ ఛేంజర్ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతుండగా తర్వాత శంకర్ ఇండియన్ 3 సినిమా కూడా రిలీజ్ ప్లాన్ ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com