Radhe Shyam : 'రాధేశ్యామ్‌' నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!

Radhe Shyam :  రాధేశ్యామ్‌ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!
Radhe Shyam : ఈ మేరకు మేకర్స్ అఫీషియల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే తమిళ్ వెర్షన్ నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

Radhe Shyam : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హేగ్దే జంటగా నటిస్తోన్న చిత్రం 'రాధేశ్యామ్‌'. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ లవర్‌ బాయ్‌గా కనిపించనున్నాడు. అప్పుడెప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వలన పలుమార్లు వాయిదా పడింది.

ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ సినిమా పైన భారీ అంచనాలను పెంచేశాయి. అయితే ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్,... పాన్ ఇండియా మూవీగా వస్తోన్న రాధే శ్యామ్ మూవీకి తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ వెర్షన్‌లకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరోలు శివ రాజ్‌కుమార్, పృథ్వీరాజ్ మరియు అమితాబ్ బచ్చన్‌‌లు వాయిస్ ఓవర్ ఇచ్చారు.

ఈ మేరకు మేకర్స్ అఫీషియల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే తమిళ్ వెర్షన్ నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కాగా రాధేశ్యామ్ చిత్రం మార్చి 11 న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి.

తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story