Dil Raju : దర్శకుల రెమ్యూనరేషన్, ట్రైలర్ల ఫేక్ వ్యూస్ : దిల్ రాజు

సోషల్ మీడియాలో ఒక వీడియో అప్లోడ్ చేస్తే దాని వ్యూస్ ను బట్టే అది ప్రజలకు ఎంత రీచ్ అయిందో తెలుస్తుంది. అయితే కొన్ని వీడియోలు అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల కొద్ది వ్యూస్ సొంతం చేసుకుంటాయి. ఇవన్నీ నిజమైనవేనా? లేక ఫేక్ వ్యూస్ అయి ఉంటాయా? అనే అనుమానం చాలా మందికి ఉంది. ముఖ్యంగా సినిమాల విషయంలో ఈ డౌట్ మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ అది ఎంత మాత్రం డౌట్ కాదు. నిజమే అని నిర్మాత దిల్ రాజు మాటల్ని బట్టి అర్థం అవుతోంది. తాజాగా 'తమ్ముడు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. హీరోలు, దర్శకుల రెమ్యూనరేషన్, ట్రైలర్ల ఫేక్ వ్యూస్ గురించి మాట్లాడారు. టీజర్, ట్రైలర్ల వ్యూస్ నంబర్లను కొనొద్దని, ఒరిజినల్ వ్యూస్ మాత్రమే ఉండాలని తన పీఆర్ టీమ్ కు చెప్పినట్లు స్పష్టం చేశారు. అంటే పీఆర్ టీమ్ వ్యూస్ కొనే పనిలో ఉందని ఆయన మాటల్ని బట్టి అర్థం అవుతోంది. అలా చేయడం ద్వారా నిజంగా ఎంతమంది చూశారో తెలియక, ఎంతగా రీచ్ అవుతుందో తెలుసుకోలేని పరిస్థితి వస్తుందనేది దిల్రాజ్ అభిప్రాయం. మరి పీఆర్ టీమ్ ఇకనైనా ఫేక్ వ్యూస్ మానేస్తారో? లేదో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com