Suriya : కంగువాకు, సలార్ కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

తమిళ్ స్టార్ సూర్య హీరోగా నటించిన కంగువా ఈ నెల 14న విడుదల కాబోతోంది. శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో దిశా పటానీ ఫీమేల్ లీడ్ గా, బాబీ డియోల్ విలన్ గా నటించారు. ఓ కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకువెళ్లే సినిమా ఇదని మేకర్స్ స్ట్రాంగ్ గా చెబుతున్నారు. నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా అయితే తమ సినిమా అన్ని రికార్డులు బద్ధలు కొడుతుందీ అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. ప్రమోషన్స్ ను కూడా చాలా అగ్రెసివ్ గా చేస్తున్నారు. బట్ ఇదంతా చూస్తున్న వారికి ఓ సినిమా సామెత బాగా కొడుతోందీ అంటున్నారు. ‘విషయం వీక్ గా ఉన్నప్పుడే ప్రమోషన్స్ పీక్ లో ఉంటాయి..’ఈ సామెత తెలియని సినిమా లవర్ ఉండడు. ఇది కంగువా విషయంలో బాగా వినిపిస్తోందీ మధ్య. ఈ విషయం ఎలా ఉన్నా.. కంగువాకు, ప్రభాస్ కల్కి సినిమాకూ ఓ లింక్ ఉందని ఎంతమందికి తెలుసు. అది కూడా ఇన్ డైరెక్ట్ గా దర్శకుడే చెప్పాడని ఎంతమంది గుర్తించారు..?
రీసెంట్ గా తెలుగులో ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు దర్శకుడు శివ మూవీ గురించి టూకీగా చెప్పమంటే.. ఇది ఐదు క్లాన్స్ (తెగలు) మధ్య జరిగే కథ అని చెప్పాడు. అంటే ఐదు తెగల మధ్య ఆధిపత్య పోరు కావచ్చు.. లేదా వారి మధ్య సమస్యలను క్యాష్ చేసుకోవడానికి వచ్చిన మరో తెగపై అంతా కలిసి తిరుగుబాటు చేయడం కావొచ్చు. అయితే ఇది పూర్తిగా ఫిక్షన్ నేపథ్యంలో తీస్తున్నారు కాబట్టి కావాల్సినంత సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవచ్చు.
మరి దీనికి కల్కికి లింక్ ఏంటంటే.. సలార్ లో కూడా మూడు తెగలు ఉంటాయి. మన్నార్, ఘనియార్, శౌర్యాంగన. ఈ మూడు తెగలే సలార్ ను శాసిస్తుంటాయి. వీరి ఆధిపత్య పోరులో శౌర్యాంగన తెగన పూర్తిగా అంతం చేస్తారు. బట్ ప్రభాస్ ఆ తెగకు చెందిన వాడే. ఇలా సలార్ లో కూడా తెగల మధ్య పోరే కనిపిస్తుంది.
కంగువాలో దర్శకుడు చెప్పినట్టు అది కూడా తెగల మధ్య పోరాటమే. కాకపోతే సలార్ కాస్త సోషలైజ్డ్ మూవీలా ఉంటుంది. కంగువా పూర్తిగా ఆటవిక తెగలతో కనిపిస్తోంది అదీ తేడా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com