Donations : సినీ ప్రముఖులు ఎవరెంత వరద సాయం ప్రకటించారంటే?

Donations : సినీ ప్రముఖులు ఎవరెంత వరద సాయం ప్రకటించారంటే?

వరద బాధితుల సహాయార్ధం సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. తమకు తోచిన సాయమందించారు. సీఎం రిలీఫ్ ఫండ్లకు భారీగా విరాళాలు అందించారు. అందులో జూ.ఎన్టీఆర్, బాలకృష్ణ తదితర నటీనటులెందురో ఉన్నారు. టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయిలు విరాళం ఇచ్చారు. తెలంగాణకు రూ. 50లక్షలు, ఏపీకి రూ.50 లక్షలు నటుడు మహేష్ బాబు ప్రకటించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీకి రూ. కోటి, నందమూరి బాలకృష్ణ ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు. ఆయ్ మూవీ నిర్మాత బన్నీ వాస్ కలెక్షన్స్ లో 25 శాతం ఏపీకి విరాళం ప్రకటించారు. వెంకీ అట్లూరి ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు విరాళం ఇచ్చారు. అనన్య నాగళ్ల ఏపీకి రూ. 2.5 లక్షలు, తెలంగాణకు రూ. 2.5 లక్షలు విరాళం ప్రకటించారు.

ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు విశ్వక్ సేన్ రూ. 5 లక్షల విరాళం అందించారు. సిద్ధు జొన్నలగడ్డ ఏపీ, తెలంగాణకు రూ.15 లక్షల చొప్పున రూ. 30 లక్షలు ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత ఎస్ రాధాకృష్ణ నాగవంశీలు కలిసి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. ఇరు రాష్ట్రాలకు చెరో రూ.25 లక్షల చొప్పున సీఎం సహాయ నిధికి జమ చేశారు. ఇక ఇటీవలే కల్కితో భారీ విజయాన్ని అందుకున్న వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ ఆంధ్రప్రదేశ్ కు రూ. 25 లక్షల సాయం ప్రకటించారు.

Tags

Next Story