Vishwak Sen : నన్ను రాజకీయాల్లోకి లాగకండి: విశ్వక్‌సేన్

తనను, తన సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దని విశ్వక్‌సేన్ నెటిజన్లను కోరారు. తాను మిడిల్ ఫింగర్ చూపిస్తున్న పోస్టర్ నెల రోజుల క్రితం విడుదలైందని, రెడ్ సూట్ ఫొటో కూడా ఇప్పటిది కాదని చెప్పారు. ‘ప్రతీసారి తగ్గను. కానీ నిన్న మనస్ఫూర్తిగా సారీ చెప్పాను. అతిగా ఆలోచించొద్దు. శాంతంగా ఉండండి. అసభ్య పదజాలం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. లైలాను బాయ్‌కాట్ చేయాలన్న ఆలోచనను బాయ్‌కాట్ చేయండి’ అని X పోస్ట్ పెట్టారు.
నటుడు పృథ్వీ వ్యాఖ్యలతో బాయ్‌కాట్ లైలా అంటూ వైసీపీ శ్రేణులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై హీరో విశ్వక్ వివరణ ఇచ్చుకున్నప్పటికీ వారు వెనక్కితగ్గలేదు. ఈక్రమంలో ఆయనకు మద్దతుగా నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #WesupportLaila అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మూవీ బాగుంటే ఎవరూ ఆపలేరని, ఒక నటుడు చేసిన వ్యాఖ్యలతో సినిమాను బాయ్‌కాట్ చేయడం కరెక్ట్ కాదని చెబుతున్నారు.
‘లైలా’ మూవీకి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా రన్ టైమ్ ఎండింగ్ కార్డ్స్‌తో కలుపుకొని 2 గంటల 16 నిమిషాలు ఉన్నట్లు మూవీ వర్గాలు పేర్కొన్నాయి. విశ్వక్ సేన్, ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఎల్లుండి థియేటర్లలో విడుదల కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com