Mani Ratnam : ఆ దృష్టితో చూడొద్దు.. రోమాంటిక్ సీన్లపై మణిరత్నం

కమల్ హాసన్ కీలక పాత్రలో మణిరత్నం తెరకె క్కిస్తున్న సినిమా థగ్ఫ్. నాయకన్ తర్వాత వారిద్దరి కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. గ్యాంగ్ స్టర్, యాక్షన్ డ్రామా ఫిల్మ్ ఇది సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 5న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. అయితే, ట్రైలర్లో త్రిష, అభిరామిలతో కమల్ హాసన్ రొమాన్స్ చేసే సన్నివేశాలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. 70 ఏళ్ల కమల్, 42ఏళ్ల త్రిషతో రొమాన్స్ ఏంటి? అంటూ పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. తనకంటే వయసులో 28ఏళ్ల చిన్న దైన అభిరామితో లిప్లక్ పైనా కొందరు ట్రోల్స్ చేశారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న దర్శకుడు మణిరత్నం ఆ విమర్శలకు సమాధానం చెప్పాడు. నిజ జీవితంలోనూ అలాంటి వ్యక్తులు ఉంటారని, సినిమాలో వాళ్లు పోషించిన పాత్రల గురించి మాత్రమే చూడాలి కానీ, కమల్, త్రిషను దృష్టిలో పెట్టుకొని చూడొద్దన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com