Sri Leela : డబుల్ ఆఫర్ .. అక్కినేని బ్రదర్స్ తో శ్రీలీల

Sri Leela : డబుల్ ఆఫర్ .. అక్కినేని బ్రదర్స్ తో శ్రీలీల
X

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. వరుసగా స్టార్ యాక్టర్తో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూనే.. 'పుష్ప2'లో 'కిస్సిక్' అంటూ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఈ పాటతో ఒక్కసారిగా ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే, ఒకేసారి సినిమాలు ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ లో చేసేందుకు శ్రీలీల సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. తన నెక్స్ట్ ప్రాజెక్టులుగా సైన్ చేసిన రెండు మూవీస్ లో అక్కినేని బ్రదర్స్ నటించబోతున్నారట. కార్తీక్ దండు, నాగచైతన్య కాంబినేషన్ లో ఓ మూవీ.. అఖిల్, మురళీ కిశోర్ కాంబోలో మరో చిత్రం తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాల్లో శ్రీలీల హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాలు సెట్స్పైకి వెళ్తాయని టాక్.

అక్కినేని అఖిల్ కొత్త మూవీ కోసం అభిమానులు చాలాకాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఏజెంట్’ తరువాత ఇన్నాళ్ళూ ఆజ్ఞతవాసంలో ఉన్న అఖిల్ అరుదుగా మాత్రమే బయట కన్పించాడు. రీసెంట్ గా తన ఎంగేజ్మెంట్, నాగ చైతన్య (పెళ్లిలో దర్శనం ఇచ్చాడు. ప్రస్తుతం అఖిల్ చేయబోయే కొత్త సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించబోతున్నట్టుగా తెలుస్తోంది.

Tags

Next Story