Hansika Petition : నాపై గృహ హింస కేసు కొట్టేయండి: హన్సిక పిటిషన్

తనతోపాటు తల్లిపై నమోదైన గృహ హింస కేసును కొట్టేయాలంటూ హీరోయిన్ హన్సిక బాంబే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను వాయిదా వేసింది. అత్లింట్లో తనను వేధిస్తున్నారంటూ హన్సిక సోదరుడు ప్రశాంత్ భార్య ముస్కాన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనకు ₹20L, ఖరీదైన బహుమతులు ఇవ్వాలని హీరోయిన్ డిమాండ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వాని, టీవీ నటి ముస్కాన్ జేమ్స్‌ను 2020లో వివాహం చేసుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల వారు 2022లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత ముస్కాన్ జేమ్స్... హన్సిక, ప్రశాంత్, జ్యోతిలపై గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదైంది. గతంలో ముంబయి సెషన్స్ కోర్టు హన్సిక, ఆమె తల్లి జ్యోతిలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు తమపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వారు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com