Sai Dharam Tej : ఎగ్ పఫ్'.. సాయిధరమ్ మాస్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక జనసేనాని పవన్ కల్యాణ్ సైతం ఘన విజయం సాధించి.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో.. ఆయన కుటుంబం, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. సంబరాలు కూడా చేసుకున్నారు. ఇక టాలీవుడ్ యంగ్ హీరో, పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సైతం తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్, వర్తమానం సురక్షితమైన చేతుల్లో ఉంది.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇప్పుడా ట్వీట్ ని గుర్తు చేస్తూ... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దారుణాలను గుర్తుచేస్తు సాయిధరమ్ ను టాగ్ చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. ఈ క్రమంలో వైసిపి కి చెందిన డాక్టర్ చింత ప్రదీప్ రెడ్డి.. సాయిధరమ్ తేజ్ ను ట్యాగ్ చేస్తూ.. గతంలో ఏపీలో జరుగుతున్న అన్యాయంపై స్పందించిన సాయి ధరమ్ తేజ్... అన్నా క్యాంటీన్ల పరిశుభ్రతపై ఎందుకు స్పందించడంలేదు. మెడలు రుద్దే Safe Hands ఎక్కడ ...అన్నా క్యాంటీన్లలో ప్లేట్లు కడగొచ్చుగా Safe Handsతో.. అంటూ ట్వీట్ చేసారు.
దానికి రిప్లై ఇస్తూ మాస్ కౌంటర్ వేశారు సాయి ధరమ్.. మీరు ఎక్కడ ఉంటారు సార్. ఆ ఎగ్ పఫ్ లో మీరు ఎంత తిన్నారు.. అంటూ చురకలు అంటించారు సాయి ధరమ్. దాంతో ఆయన చేసిన ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సాయి ధరమ్ తేజ్
సినిమాల విషయానికి వస్తే... విరూపాక్ష, బ్రో వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న సాయి ధరమ్ తేజ్.. కొత్త చిత్రం ఇటీవలే లాంఛనంగా మొదలైంది. రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని.. హనుమాన్ సినిమాను నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com