Emergency On Netflix : మార్చి 17 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఎమర్జెన్సీ స్ట్రీమింగ్

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటించడంతోపాటు దర్శకత్వం లో వచ్చిన సినిమా ఎమర్జెన్సీ. వివాదాల కు కేంద్ర బిందువగా మారి పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా గత నెల 17 థియేటర్లలో రిలీజ్ అయ్యింది. దివంగత ప్రధాని ఇందిరా గాందీ బయోపిక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మూవీ త్వరలో ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందని కంగన తాజాగా ప్రకటించారు. ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. నెట్ ఫ్లిక్స్ వేదికగా మార్చి 17 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుందని తెలిపారు. ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భాన్ని ఆధారంగా చేసుకొని దీనిని సిద్ధం చేశారు. ఇందిరాగాంధీగా కంగనా నటించగా.. జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్పేయీగా శ్రేయాస్ తల్పడే నటించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. రూ.60 కోట్లతో దీనిని రూపొందించగా.. రూ.21 కోట్లు మాత్రమే వసూలు చేసినట్టు తె లుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com